June 5, 2026
Explore
యోగాంధ్ర–2026’ విజయవంతం చేయాలి: జేసీ

యోగాంధ్ర–2026’ విజయవంతం చేయాలి: జేసీ

June 5, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో ఈనెల 7 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
యోగా శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదపడుతుందని, అందరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని జేసీ కోరారు. మాస్టర్ ట్రైనర్ల శిక్షణ అనంతరం జూన్ 9 నుండి 17 వరకు పౌరులకు యోగా నేర్పుతారన్నారు. వ్యాసరచన, యోగా పోటీలు నిర్వహించి, జూన్ 21న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు.

Tags: ‘YogaAndhra-2026’ must be made a success: JC