ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం:
ముఖ్యమంత్రి పిలుపుతో జిల్లావ్యాప్తంగా పర్యావరణ ఉద్యమం
పోలీసు కార్యాలయాలు, అన్ని పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటిన జిల్లా పోలీసులు
ఈ ఏడాది థీమ్: “భూ పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరవును తట్టుకునే శక్తిని పెంపొందించడం”
అనకాపల్లి ముచ్చట్లు:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ముఖ్య అతిథిగా విచ్చేసి, పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కలిసి స్వయంగా మొక్కలు నాటారు.
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం “భూ పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరవును తట్టుకునే శక్తిని పెంపొందించడం” అనే ముఖ్యమైన థీమ్‌తో, “మన భూమి.. మన భవిష్యత్తు” అనే నినాదంతో నిర్వహించబడుతోంది. దెబ్బతిన్న నేలలను కాపాడుకోవడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా అధికారులు అవగాహన కల్పించారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశాన్ని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎస్పీ మాట్లాడుతూ…”భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన అందరి కనీస బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పచ్చదనం పెంపు, ఇంధన వనరుల పొదుపు నేటి తరం అత్యవసరంగా భావించాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, ఈ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు.
అనకాపల్లి జిల్లా ప్రజలు, పోలీసు సిబ్బంది అందరూ ఈ పర్యావరణ పరిరక్షణ దీక్షకు కట్టుబడి ఉండాలని, నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలని ఎస్పీ కోరారు.
జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు అనకాపల్లి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలలో ఆయా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని ఎస్పీ గారు తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడటంలో జిల్లా పోలీసు శాఖ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో:అదనపు ఎస్పీ ఎల్.మోహనరావుఎస్.బి డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, ఏవో సిహెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు బాల సూర్యారావు, లక్ష్మి, శ్రీనివాసరావు, సేనం రమేష్, పిల్లా రమేష్
ఆర్ఐ రామకృష్ణారావుమరియు వివిధ విభాగాల ఎస్సైలు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags: SP Tuhin Sinha planted saplings at the District Police Office.