రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి ప్రతిపాదిత నూతన ఆధునిక బస్ స్టేషన్ డీపీఆర్ (DPR)ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అధికారులు మంత్రిని కలసి డీపీఆర్ వివరాలు, వసతులపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బస్ స్టేషన్ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Tags: Minister Mandipalli reviews the DPR for the new Rayachoti bus station.