రాయచోటి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం అడహక్ తహసీల్దార్లుగా పనిచేస్తున్న 11 మంది డిప్యూటీ తహసీల్దార్లకు (డీటీ) పూర్తిస్థాయి తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ సీసీఎల్ఎ (CCLA) కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. డిపార్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ ఆమోదంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. జూన్ 6 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి రానుండటంతో, వీరికి వెనువెంటనే కొత్త స్థానాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. వీరంతా సొంత జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
పదోన్నతి పొందిన వారు:
- అగ్రహారం బావాజాన్ (బి.కొత్తకోట)
- పామిలేటి (ములకలచెరువు)
- తపస్విని (మదనపల్లె)
- హరికుమార్ (కలెక్టరేట్)
- తేజస్విని (వాయల్పాడు)
- అజారుద్దీన్ (రామసముద్రం)
- వెంకటేష్ (రామాపురం)
- రామాంజనేయులు (చిన్నమండ్యం)
- క్రాంతి కుమార్ (లక్కిరెడ్డిపల్లె)
వివిధ రకాల అవినీతి ఆరోపణలు, రికార్డుల ట్యాంపరింగ్, విధుల్లో నిర్లక్ష్యంపై విచారణ పెండింగ్‌లో ఉండటంతో ముగ్గురు అధికారుల పదోన్నతులను సిసిఎల్ఎ నిలిపివేసింది.
కే. కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లె తహసీల్దార్‌గా పనిచేస్తూ కలెక్టరేట్‌కు బదిలీ అయిన ఈయనపై అవినీతి, రికార్డుల ట్యాంపరింగ్, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై విచారణ పెండింగ్‌లో ఉంది.
వాయల్పాడు (వాల్మీకిపురం) పౌరసరఫరాల డీటీగా ఉన్న ఈయనపై విధుల్లో నిర్లక్ష్యం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై క్రమశిక్షణా చర్యలు కొనసాగుతున్నాయి.
నందలూరు తహసీల్దార్‌గా ఉన్న ఈయన ప్రభుత్వ భూములు, అసైన్డ్, ఇనాం భూముల రికార్డుల పరిశీలనలో అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. ఇప్పటికే ఛార్జ్ మెమో జారీ కాగా, విచారణ పూర్తయ్యే వరకు ప్రమోషన్ నిలిపివేశారు.