రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. మధుసూదన వర్మ శుక్రవారం కడప ప్రాంతీయ సంయుక్త విద్యా సంచాలకులు (ఆర్‌జేడీ)గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఉన్నత పదవిని చేపట్టడం పట్ల రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విద్యా రంగంలో విశేష అనుభవం, పరిపాలనా నైపుణ్యం కలిగిన డా. మధుసూదన వర్మ ఆర్‌జేడీగా ఎంపిక కావడం కళాశాలకే గర్వకారణమని సిబ్బంది పేర్కొన్నారు. ప్రాంతీయ స్థాయిలో ఆయన సేవలు విద్యాభివృద్ధికి మరింత తోడ్పడతాయని ఆకాంక్షించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మునియా నాయక్, అధ్యాపకులు బి. వెంకటరావు, యు. ప్రసాద్, ఫిజిక్స్ అధ్యాపకులు డాక్టర్ వెంకట్రావు, అధ్యాపకేతర సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Tags: Dr. Madhusudana Varma assumes charge as Kadapa RJD.