June 5, 2026
Explore
మదనపల్లెలో యువకుడిపై బండరాళ్లతో దాడి

మదనపల్లెలో యువకుడిపై బండరాళ్లతో దాడి

June 5, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ యువకుడిపై బండరాళ్లతో దాడి చేసిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. అమ్మ చెరువు మిట్టలో కాపురముంటున్న జయకుమార్ (35)ను అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు మాట్లాడే పని ఉందంటూ పిలిచాడు. అనంతరం పాత కక్షల నేపథ్యంలో శ్రీనివాసులు అతనిపై బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు గాయపడ్డ జయకుమార్‌ను చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Tags:Youth attacked with boulders in Madanapalle