June 5, 2026
Explore
రామసముద్రంలో భారీగా ఎరువుల సీజ్

రామసముద్రంలో భారీగా ఎరువుల సీజ్

June 5, 2026 | Andhra Pradesh

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం మండల పరిధిలోని కుదురుచీమనపల్లిలో గల ఓ ఎరువుల దుకాణంలో విజిలెన్స్ శాఖ అధికారులు లక్ష్మణ్ కుమార్, రామయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా దుకాణంలోని స్టాక్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.

నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి లెక్కలు లేకుండా నిల్వ ఉంచిన 6.85 మెట్రిక్ టన్నుల ఎరువులను అధికారులు గుర్తించారు. సుమారు రూ.2.65 లక్షల విలువైన ఈ ఎరువుల నిల్వలను అధికారులు జప్తు (సీజ్) చేశారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) జాఫర్ పాల్గొన్నారు.

Tags:Massive fertilizer seizure in Ramasamudram