బీ కొత్తకోట ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటనకు సంబంధించిన వివరాలను బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి వెల్లడించారు.పీటీఎం మండలం పిడుంవారిపల్లికి చెందిన రెడ్డప్ప కుమారుడు కొండ ఉదయ్ కుమార్ (20) తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కాగా, శుక్రవారం ఆయన తన బైకుపై తిరుపతి నుంచి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యంలోని కాండ్ల మడుగు క్రాస్ వద్దకు రాగానే ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఉదయ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Engineering student dies in road accident.