రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేటకు చెందిన వైస్సార్సీపీ ముఖ్య నాయకులతో పాటు 70 కుటుంబాలు గురువారం ఆ పార్టీని వీడి టీడీపీలో చేరాయి. రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమమే టీడీపీకి ఆదరణ పెరగడానికి కారణమన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.
Tags:Setback for YCP in Masapeta; 70 families join TDP.