June 4, 2026
Explore
సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు

June 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

సోషల్‌ మీడియా ద్వారా సామాజిక మధ్యమాల్లో విధ్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. గురువారం సీఐ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన , కించపరిచే , రెచ్చగొట్టే , తప్పుడు పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కులాలు, మతాలు , మహిళలు, అధికారులు, నాయకులను ఉద్ధేశించి వ్యక్తిగత దూషణలు, మార్ఫింగ్‌ పోటోలు , వీడియోలు చేస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అన్సర్‌బాషా, కెవి.రమణ , సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Strict action against provocative posts on social media.