పుంగనూరు ముచ్చట్లు:
మలేరియా వ్యాదిపట్ల ప్రజలు అవగాహన చేసుకుని, చికిత్సలు పొందాలని సబ్ యూనిట్ అధికారి గంగయ్య తెలిపారు. గురువారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాది ఆనాఫలిస్ అనే ఆడదోమ కుట్టడం వలన వ్యాపిస్తుందని , దీని ద్వారా మనిషి కాలేయంలోని రక్తకణాలు దెబ్బతిని తలనొప్పి, తీవ్ర జ్వరం, కళ్ళు ఎర్రబడటం, చమటలు పట్టడం జరుగుతుందన్నారు. దీనిని తక్షణమే మలేరియాగా గుర్తించి, చికిత్సలు చేసుకోవాలన్నారు. ఇందుకు నివారణగా ఇంటి పరిసరాలలో మురుగునీటి కాలువలు లేకుండ , దోమలు ప్రభలకుండ జాగ్రత్తలు వహించాలని , ప్రతి ఒక్కరు మంచినీటిని కాచి, వడపోసి తాగాలన్నారు. అలాగే దోమలు కుట్టకుండ దోమతెరలతో పాటు , దోమల నివారణ మందులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సోమశేఖరాచారి , ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది , ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags: Awareness Regarding Malaria is Essential