June 4, 2026
Explore
బాబు మ్యానిఫెస్టోను తగులబెట్టిన వైఎస్సార్‌సిపి నాయకులు

బాబు మ్యానిఫెస్టోను తగులబెట్టిన వైఎస్సార్‌సిపి నాయకులు

June 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను చంద్రబాబు అధికారంలోకి రాగానే చెత్తబుట్టలో పడే యడంతో ఆమ్యానిఫెస్టోను, షూరిటి బాండ్లను , సూపర్‌-6 హామీల పత్రాలను గురువారం వైఎస్సార్‌సిపి నాయకులు తగులబెట్టారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్‌, పార్టీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి ల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే బాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మ్యానిఫెస్టోను, షూరిటిబాండ్లను తగులబెట్టారు. కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో సూపర్‌-6 గోవిందా… ఇదేమిరాజ్యం… దొంగలరాజ్యం….దోపిడిరాజ్యం అంటు నినాదాలు చేశారు. అలాగే వైఎస్సార్‌సిపి జిందాబాద్‌…పెద్దిరెడ్డి జిందాబాద్‌…మిధున్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా మాజీ ఎంపి రెడ్డెప్ప మాట్లాడుతూ తెలుగుదేశం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు కూడ మంజూరు చేయని దౌర్భాగ్యపు స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన ఎద్దెవ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయరామిరెడ్డి, నరసింహులు, కిజర్‌ఖాన్‌, మహబూబ్‌బాషా, కాళిదాసు, జెపి.యాదవ్‌, ఆర్‌కె.రామకృష్ణ, ఇంతియాజ్‌, బాబునాయక్‌, రామకృష్ణారెడ్డి, రాజేష్‌, రమణ, సురేష్‌, హేమంత్‌, బాలు, బండకుమార్‌, సిద్ధిక్‌, ఖాదర్‌, ఇర్ఫాన్‌, రేష్మా, సాజిదా, భారతి, ఈశ్వరాచారి, నూర్‌,రమణ, ఖాజ, అస్లాంమురాధి, బావాజాన్‌, గౌస్‌, సలామత్‌, రఫిక్‌, నజీర్‌, మన్సూర్‌, రాఘవేంద్ర, కంచి, తదితరులు పాల్గొన్నారు.

సోమలలో…

సోమల మండలంలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మ్యానిఫెస్టోను, బాండ్లను తగులబెట్టే కార్యక్రమాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఈశ్వరయ్య, మండల అధ్యక్షుడు గంగాధర్‌రాయల్‌, వైస్‌ఎంపిపి ప్రభాకర్‌, సాంబశివయ్య, వెంకటరమణ, రమణ, నాగభూషణ్‌రెడ్డి, సిఎల్‌పి.రెడ్డి, వరదం రమణ, వేముల హరినాథ్‌, మాజీ సర్పంచ్‌లు శ్రీరాములు, కోదండరాజు, కర్రీ వెంకటరమణ, రెడ్డెప్ప, వాటర్‌షెడ్‌ చైర్మన్‌ పుష్పావతి, చంద్రశేఖర్‌నాయుడు, బాలాజి, షాహిద్‌బాష తదితరులు పాల్గొన్నారు.

Tags: YSRCP Leaders Burn Babu’s Manifesto