June 4, 2026
Explore
పెద్ది సినిమా కథ

పెద్ది సినిమా కథ

June 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈ దేశంలో ఊరు పేరు, ఊళ్ళో జనాలకి గుర్తింపుకార్డు కూడా లేని “కొండ కింద ఊరు” లో కిరాయికి క్రికెట్ ఆడుకొనే ఆకతాయి కుర్రోడు పెద్ది తన ఊరికి తనకి గుర్తింపు రావాలంటే జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం తనకిష్టమైన ఆటలతో సాధ్యమని తన పంథాని మార్చుకొని ఒక క్రికెటర్ నుండి ఒక అథ్లెట్ గా మారి అనుకున్నది సాధిస్తాడా? లేదా? అన్నదే పెద్ది సినిమా కథ. ఊరి బాగు కోసం పెద్ది ఆలోచన మార్చిన అప్పలసూరి మరణానికి న్యాయం జరుగుతుందా? లేదా? అన్నదే కథలో మరో కోణం.

బుచ్చిబాబు చరణ్ ని ఎలా ఒప్పించి సినిమా తీసాడో గానీ చరణ్ యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటాడు. ఒక క్రికెటర్ గా ఒక రెజ్లర్ గా ఒక రన్నర్ గా చివరి వరకు ఆడాడు అనుకుంటే పొరపాటే. తన ఊరికోసం దగ్గర ట్రైన్ హాల్ట్ కోసం పోరాడాడు. కథలేని కాన్సెప్ట్ తో ప్రధమార్థం ఏదోలా సాగదీసిన బుచ్చిబాబు ద్వితీయార్థంలో మాత్రం తాను అనుకున్నది సూటిగా స్పష్టంగా ప్రేక్షకుడికి చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ద్వితియార్థం కుస్తీ పోటీల నుండి మొదలు చివరికి ఏషియన్ పోటీల్లో బంగారు పతకం సాధించినంత వరకు ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెట్టి భావొద్వేగానికి గురి చేస్తాడు.

రామ్ చరణ్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. మెగా పవర్ స్టార్ట్ స్థాయిని కూడా పక్కన పెట్టేసి కథలో పరకాయ ప్రవేశం చేసేసాడు. ప్రేక్షకుడు కథనంలోకి వెళితే తన నటనతో రామ్ చరణ్ ని మరిపించేలా చేస్తాడు. ఏ ఆర్ రెహమాన్ పాటలు నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్. చరణ్ అభిమానిగా వెళ్లి పెద్దికి అభిమానిగా థియేటర్ నుండి బయటికి వస్తారు.

చెప్పడం కాదుగాని భయ్యా! ఒక్కసారి సినిమాకి వెళ్లి రండి. ఊరి కోసం చరణ్ చేసిన పోరాటం త్యాగం మిమ్మల్ని భావొద్వేగానికి గురి చేస్తుంది. Cross over Athlet అనే కాన్సెప్ట్ తో బుచ్చిబాబు రాసుకున్న కథకి 200% న్యాయం చేసాడు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

Tags; The Story of the Movie ‘Peddi’