June 4, 2026
Explore
కాక్రోచ్ ఆందోళ‌న‌ల‌కు సోనమ్ వాంగ్ చుక్ మ‌ద్ద‌తు

కాక్రోచ్ ఆందోళ‌న‌ల‌కు సోనమ్ వాంగ్ చుక్ మ‌ద్ద‌తు

June 4, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశంలో విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 5లోగా తన పదవికి రాజీనామా చేయకుంటే, జూన్ 6న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపడుతున్న భారీ నిరసన ప్రదర్శనలో తాను కూడా పాల్గొంటానని ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ హెచ్చరించారు. దేశంలో విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులు, సంస్కరణల అమలుపై ఉన్న విస్తృత ఆందోళనలే తన నిర్ణయానికి కారణాలని మంగళవారం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ప్రత్యేక వీడియోలో ఆయన పేర్కొన్నారు.

ఈ ఉద్యమ నిర్వాహకులతో తాను మాట్లాడానని, ఈ పోరాటం భారతీయ యువత ఆవేదనను, వారి గొంతుకను ప్రతిబింబిస్తోందని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు యువత ఎంతో కృషి చేస్తోందని, కానీ ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం గత నాలుగు దశాబ్దాలుగా తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని గుర్తు చేస్తూ, జాతీయ విద్యా

Tags; Sonam Wangchuk Supports ‘Cockroach’ Protests