అమరావతిముచ్చట్లు:
ACB అంటే Anti Corruption Bureauగవర్నమెంట్ ఉద్యోగులు లంచం అడిగితే వీళ్లే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు.
- ACB ట్రాప్ ఎలా చేస్తుంది?స్టెప్ బై స్టెప్
ముఖ్యం:లంచం ఇచ్చే ముందే ACB కి చెప్పాలి. ఇచ్చాక చెప్తే ప్రూఫ్ ఉండదు.
- మీరు కంప్లైంట్ ఇవ్వాలి: లంచం అడిగిన ఆఫీసర్ పేరు, డిపార్ట్‌మెంట్,ఎంత అడిగాడు,ఎందుకు అడిగాడు అని చెప్పాలి
- ACB వెరిఫికేషన్: ACB DSP మిమ్మల్ని సీక్రెట్‌గా కలిసి మ్యాటర్ నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. మీరు చెప్పింది రికార్డ్ చేస్తారు
- ట్రాప్ ప్లాన్: ACB వాళ్లు మీకు ఫినాప్తలిన్ పౌడర్ రాసిన నోట్లు ఇస్తారు. ఈ పౌడర్ కంటికి కనిపించదు. కానీ లంచం తీసుకున్నవాడు చేతికి అంటుకుంటుంది
- రెడ్ హ్యాండెడ్: మీరు ఆఫీసర్‌కి డబ్బులు ఇచ్చిన వెంటనే బయట కాపు కాసిన ACB టీం లోపలికి వచ్చి ఆఫీసర్ చేతులు వాష్ చేస్తారు. నీళ్లు పింక్ కలర్ లోకి మారితే దొరికిపోయినట్టే
- అరెస్ట్ + కేసు: వెంటనే అరెస్ట్ చేసి Prevention of Corruption Act 1988 కింద కేసు పెడతారు. 7 ఏళ్ల జైలు + జాబ్ నుండి డిస్మిస్
సాక్ష్యం:ఫినాప్తలిన్ టెస్ట్ + మీ వాంగ్మూలం + వీడియో/ఆడియో ఉంటే కేసు స్ట్రాంగ్.
ACB WhatsApp నంబర్ కు ఫోటో, వీడియో,ఆడియో ప్రూఫ్ పంపడానికి..
- కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు
- పేరు బయటకు రాదు: ACB చట్టం ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన మీ పేరు సీక్రెట్ గా ఉంచుతారు.భయపడొద్దు
- డబ్బులు మీవి కావాలి: ట్రాప్‌కి వాడే డబ్బులు ముందు మీరే తేవాలి.కేసు అయ్యాక కోర్టు ద్వారా మీకు తిరిగి ఇచ్చేస్తారు
- ఆడియో/వీడియో ఉంటే బెస్ట్: “లంచం ఇస్తేనే పని చేస్తా” అని ఆఫీసర్ అన్న మాటలు ఫోన్‌లో రికార్డ్ చేసి ఉంటే ACB కి ఈజీ అవుతుంది
- ట్రాప్ ఫెయిల్ అయితే:ఒకవేళ ఆఫీసర్ డౌట్ వచ్చి డబ్బులు తీసుకోకపోతే కేసు ఉండదు.కానీ ACB వాళ్లు అతనిపై నిఘా పెడతారు
- ACB ఎవరెవరిని పట్టుకోగలదు?
గ్రామ సెక్రటరీ నుండి కలెక్టర్ వరకు ఏ గవర్నమెంట్ ఉద్యోగి లంచం అడిగినా ACB పరిధిలోకే వస్తుంది.
సర్పంచ్:ఎన్నికైన ప్రజా ప్రతినిధి కాబట్టి ACB డైరెక్ట్‌గా ట్రాప్ చేయదు.కానీ సర్పంచ్ అవినీతిపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ కి లేదా కలెక్టర్‌కి కంప్లైంట్ ఇస్తే ACB తో కలిసి విచారణ చేస్తారు_
షార్ట్‌గా మీరు చేయాల్సింది
సెక్రటరీ/MPDO/ఇతర ఆఫీసర్ లంచం అడిగితే
వెంటనే 1064 కి కాల్ చేయండి
Tags; Anti-Corruption Bureau (ACB) – How Does It Catch Those Who Accept Bribes?