June 3, 2026
Explore
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్..! కోట్ల లావాదేవీల గుట్టు రట్టు…

ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్..! కోట్ల లావాదేవీల గుట్టు రట్టు…

June 3, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

నరసరావుపేటలో గత కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న గోల్డ్ శేఖర్ అలియాస్ కందుకూరి వీరశేఖరాచారి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు..

టూ టౌన్ పోలీసుల చాకచక్యంతో నంద్యాల జిల్లా మహానంది సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు..

సాధారణ గోల్డ్ అప్రైజర్‌గా ప్రారంభమైన గోల్డ్ శేఖర్, తర్వాత క్రికెట్ బుకీ అవతారం ఎత్తి కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు..

క్రికెట్ బెట్టింగ్‌లు, ట్రేడింగ్ పేరుతో మోసాలు చేస్తూ భారీ స్థాయిలో డబ్బులు సంపాదించినట్లు విచారణలో బయటపడింది..

గోల్డ్ శేఖర్‌పై ఇప్పటికే పలు క్రికెట్ బెట్టింగ్ కేసులు, పోక్సో, ఎన్‌డీపీఎస్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు..

తాజాగా రూ.1.44 కోట్ల మోసం కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు..

ఇంకా ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని టూ టౌన్ పోలీసులు స్పష్టం చేశారు.

Tags: Cricket Bookie ‘Gold’ Shekhar Finally Nabbed by Police! Multi-Crore Transaction Racket Exposed…