పుంగనూరుముచ్చట్లు:
రహదారి నిబంధనల మేరకు వాహనదారులు వాహనాలను నడపాలని, రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని ఎంవిఐ సుప్రియ వాహనదారులను , డ్రైవర్లను హెచ్చరించారు. బుధవారం ఆమె జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఓవర్‌లోడ్డు, పర్మిట్లు, ఫిట్నెస్, పొల్యూసన్ , ఇన్సూరెన్సు లేని వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసి , జరిమానాలు విధించారు. అలాగే వేగ పరిమితికి మించి వాహనాలు నడిపే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రెండవ సారి దొరికితే కేసు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తామని, మితిమీరిన వేగాలతో ప్రమాదాలు తీవ్రమౌతోందని హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలను నడిపితే ఆ వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Tags; Vehicles must be driven in accordance with the regulations.