పుంగనూరుముచ్చట్లు:
ఎంఆర్‌పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరసింహులు , జిల్లా ఇన్‌చార్జ్ కోట డేనియల్ కలసి పట్టణంలోని మార్కెట్ యార్డు, మండలంలోని లక్కుంట, వనమలదిన్నె, కుమ్మరగుంట ప్రాంతాలలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 30న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ప్రాంతంలోను మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు ప్రభాకర్, విజయ్, విశ్వనాథ్, నారాయణ, అమరనాథ్, బాబు, బుడ్డన్న, సురేష్, వెంకట్రమణ, కేశవ, మహేష్, రమణ, ఏడూరు నారాయణ, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
Tags; MRPS Flags Unveiled