June 3, 2026
Explore
వైఎస్సార్‌సిపి చే బాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లు విడుదల

వైఎస్సార్‌సిపి చే బాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్లు విడుదల

June 3, 2026 | Andhra Pradesh

-బాబుకు వ్యతిరేక నినాదాలు

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పోస్టర్లను బుధవారం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆధ్వర్యంలో విడుదల చేశారు. పట్టణంలో వైఎస్సార్‌సిపి నాయకులు ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, బోయకొండ మాజీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పికెఎం ఉడా మాజీ చైర్మన్‌ వెంకటరెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పార్టీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి ల ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరైయ్యారు. నాయకులు , కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో సూపర్‌-6 గోవిందా… ఇదేమిరాజ్యం… దొంగలరాజ్యం….దోపిడిరాజ్యం అంటు నినాదాలు చేశారు. అలాగే వైఎస్సార్‌సిపి జిందాబాద్‌…పెద్దిరెడ్డి జిందాబాద్‌…మిధున్‌రెడ్డి జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, అలీమ్‌బాషా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రెండేళ్లు గడిచిన ఒక సంక్షేమ పథకం కూడ అర్హులైన పేదలకు అందలేదని ఆరోపించారు. సూపర్‌-6లో ఒక్క పథకం కూడ అందలేదని, పైగా మహిళలపై ఎనలేని ప్రేమ ఉన్నట్లు ర్యాలీలు నిర్వహించడం , తెలుగుదేశం దిగజారుడు తనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిజర్‌ఖాన్‌, మహబూబ్‌బాషా, కాళిదాసు, జెపి.యాదవ్‌, ఆర్‌కె.రామకృష్ణ, ఇంతియాజ్‌, సిద్ధిక్‌, ఖాదర్‌, ఇర్ఫాన్‌, రేష్మా, సాజిదా, భారతి, నూర్‌,రమణ, ఖాజ, అస్లాంమురాధి, బావాజాన్‌, గౌస్‌, సలామత్‌, రఫిక్‌, నజీర్‌, మన్సూర్‌, కంచి, తదితరులు పాల్గొన్నారు.

Tags;YSRCP Releases Posters Marking Two Years Since Babu’s ‘Backstabbing’