June 3, 2026
Explore
ప్రజలను మోసగిస్తేనే బాబుకు అధికారం

ప్రజలను మోసగిస్తేనే బాబుకు అధికారం

June 3, 2026 | Andhra Pradesh

మాజీ ఎంపీ రెడ్డెప్ప

పుంగనూరుముచ్చట్లు:

ప్రతి సారి ఎన్నికల్లోను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవి కోసం మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించడం , అధికారం రాగానే వాటిని తుంగలో తొక్కేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా అని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఎద్దెవ చేశారు. బుధవారం పట్టణంలో బాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమ పోస్టర్లను వైఎస్సార్‌సిపి విడుదల చేసింది. రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన సూపర్‌-6 హామీలు ఒక్కటి కూడ నేరవేరలేదని, ప్రజలు రెండేళ్లకే బాబు పాలనతో విసిగిపోయారని మండిపడ్డారు. రెండేళ్ళలో ఒక్క కుటుంభానైన బాగుచేశారా అంటు నిలధీశారు. నిరుద్యోగులను మోసం చేసేందుకు దగా డిఎస్సీ చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు క్యాలెండర్‌ ప్రకారం సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. ప్రజలు ఈ విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరి జీవితాలతోను చలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, బోయకొండ మాజీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పికెఎం ఉడా మాజీ చైర్మన్‌ వెంకటరెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, పార్టీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి, పార్టీ నేతలు జయరామిరెడ్డి, అమరనాథరెడ్డి, బాబునాయక్‌, రామకృష్ణారెడ్డి, రాజేష్‌, రమణ, సురేష్‌, హేమంత్‌, బాలు, బండకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Babu gains power only by deceiving the people.