పుంగనూరుముచ్చట్లు:
ద్విచక్రవాహనాలలో ప్రయాణించే వారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. మంగళవారం పట్టణంలో ద్విచక్రవాహనాలలో ప్రయాణించే వారికి హెల్మెట్ లేకపోవడంతో వారిని గుర్తించి పలు సూచనలు చేయడంతో పాటు అపరాద రుసుము విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వేగం కన్నా ప్రాణం మిన్న అన్నారు. ప్రాణం కాపాడుకునేందుకు ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.హెల్మెట్ ధరించడం వలన ప్రమాదం సంభవించిన సమయంలో ప్రాణనష్టం వాటిళ్లదని , ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేకుండ సెల్‌ఫోన్‌లో సంబాషిస్తూ , మధ్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రమణ, సిబ్బంది గణేష్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.
Tags: Helmets are mandatory for two-wheeler riders.