June 2, 2026
Explore
తల్లిపై కర్రతో దాడి చేసిన కుమారుడు

తల్లిపై కర్రతో దాడి చేసిన కుమారుడు

June 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కన్నకుమారుడు మధ్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిపై దాడి చేసిన సంఘటన పట్టణ సమీపంలోని నక్కబండ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నక్కబండ ప్రాంతంలో నివాసం ఉన్న రహాత్‌జాన్‌ కుమారుడు ఆసిఫ్‌ మధ్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వమని తల్లిని కోరాడు. ఆమె మందలించడంతో తల్లిపై కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి గాయపడటంతో కుటుంబ సభ్యులు 108లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Son attacks mother with a stick.