ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్
పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని బాలగురవయ్యగారిపల్లెకి చెందిన దళిత మహిళలు ఇండ్లపట్టాలు ఇవ్వాలంటు డిమాండ్ చేస్తూ తహశీల్ధార్ కార్యాలయం వద్ద మంగళవారం బైఠాయించి ధర్నా చేశారు. దళిత నాయకుడు చెన్నరాయుడు ఆధ్వర్యంలో గ్రామస్తులు తహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు. గత ఆరు నెలలుగా తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్న రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు కబ్జా చేస్తున్నారని, అలాంటి భూములు పేదలకు పట్టాలు ఇస్తే తప్పేంటని నిలధీశారు. వర్షాలు వస్తే బాలగురవయ్యగారిపల్లెలోని 50 దళితుల ఇండ్లు మునిగిపోతుందని , ప్రతి యేటా ఇదే సమస్య ఎదురౌతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కబ్జాదారులతో కుమ్మకై దళితులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
Tags: Dalits from Balaguravayyagaripalle stage a protest at the Tahsildar’s office.