June 2, 2026
Explore
పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా

పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా

June 2, 2026 | Andhra Pradesh

: – జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాల్‌ప్రాక్టీస్‌కు అస్సలు తావులేకుండా ఉండేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశాము. మదనపల్లి, రాయచోటితో పాటు జిల్లాలోని అన్ని ప్రధాన పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలను డ్రోన్ల ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, పరీక్షా కేంద్రాల సమీపంలో అనుమానాస్పదంగా సంచరించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు సజావుగా సాగేందుకు తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరడమైనది.

Tags:Tight surveillance with drones at class 10th and inter supplementary examination centers