June 2, 2026
Explore
కంటైనర్లలో అక్రమంగా తరలిస్తున్న పశువులు: పట్టుకున్న ప్రజలు

కంటైనర్లలో అక్రమంగా తరలిస్తున్న పశువులు: పట్టుకున్న ప్రజలు

June 2, 2026 | Andhra Pradesh

తంబళ్లపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పెద్దమండ్యం జడ్పీ హైస్కూల్ వద్ద మంగళవారం అక్రమంగా పశువులను తరలిస్తున్న 10 కంటైనర్ లారీలను స్థానిక గ్రామ ప్రజలు అడ్డగించి పట్టుకున్నారు. కంటైనర్‌లలో ఆవులు, ఎద్దులు, ఎనుములు కలిపి సుమారు 300 వరకు పశువులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
మొలకలచెరువులో పోలీస్ చెక్‌పోస్ట్ ఉండుట వలన, సదరు వాహనాలు కొక్కంటి క్రాస్ నుండి ఎద్దులవారికోట – బండ్రేవు మార్గం గుండా పెద్దమండ్యం వైపు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన ఎద్దులవారికోట గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి వాహనాలను వెంబడిస్తూ పెద్దమండ్యం గ్రామ ప్రజలకు సమాచారం అందించాడు. అనంతరం గ్రామ ప్రజలు కలిసి పెద్దమండ్యం జడ్పీ హైస్కూల్ వద్ద కంటైనర్ లారీలను అడ్డగించి పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అసలైన అక్రమ రవాణాకు పాల్పడే నేరస్తులను అరెస్టు చేస్తారు లేక డ్రైవర్ క్లీనర్ల పై కేసులు కట్టి చేతులు దులుపుకుంటారు వేచి చూడాల్సి ఉంది.

Tags: Cattle Being Illegally Transported in Containers: Caught by the Public