June 1, 2026
Explore
తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన ఎంపీ,ఎమ్మెల్యే.

తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ను ప్రారంభించిన ఎంపీ,ఎమ్మెల్యే.

June 1, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి 6వ నెంబర్ ప్లాట్ఫారంపై జెండా ఊపి సాగనంపిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, డీసీఎం మోహన్ కృష్ణ.

గుంతకల్ డివిజన్ ఆధ్వర్యంలో రైలు నం. 17433/17434 తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉదయం 8:15 గంటలకు బయలుదేరింది.

గతంలో 07051/07052 ప్రత్యేక రైలుగా నడిచిన రైలు, శాశ్వత రూపం కల్పిస్తూ రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్.

ఈ రైలు తిరుపతి నుంచి బయలుదేరి రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, వికారాబాద్ మార్గాల ద్వారా ప్రయాణించి సాయంత్రానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అనంతరం చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా సుమారు 2,795 కిలోమీటర్లు ప్రయాణించి రక్సౌల్ జంక్షన్ చేరుకుంటుంది.

ఈ వివరాలను మండల వాణిజ్య అధికారి, గుంతకల్ మరియు స్టేషన్ డైరెక్టర్ మోహన కృష్ణ వెల్లడించారు.

Tags:MP and MLA Flag Off Tirupati–Raxaul Express.