పుంగనూరుముచ్చట్లు:
ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సోమవారం సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గురురాజారావు అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ పెన్షనర్లను సన్మానించారు. గురురాజారావు మాట్లాడుతూ 12వ పీఆర్‌సి ఏర్పాటు చేయాలని, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని , కమ్యూటేషన్ పీరియడ్‌ను 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలని, 70, 75 సంవత్సరాలు ఉన్న వారికి 10, 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని , మరణభృతి నెల పెన్షన్ ఇవ్వాలని , ఈహెచ్‌ఎస్ కార్డులతో నగదు రహిత చికిత్సలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎన్ని వినతిపత్రాలు పంపిన స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, పోలీస్ వెంకటేష్, సుబ్రమణ్యం, భరత్‌భూషణ్, ఈశ్వర్‌కుమార్‌రెడ్డి, రమేష్‌బాబు, చలపతి, మురళ్యికృష్ణారెడ్డి, జహీర్, కేశవరెడ్డి, మహిళ ప్రతినిధులు గంగులమ్మ, లీలావతమ్మ, రెడ్డికుమారి తదితరులు పాల్గొన్నారు.
Tags: Pensioners’ issues must be resolved.