కోట్లాది రూపాయల ఆస్తుల దురాక్రమణ
- తహశీల్ధార్, ఆర్‌ఐ , వీఆర్‌వో కుమ్మక్కు
- పట్టించుకోని ప్రభుత్వం
పుంగనూరుముచ్చట్లు:
స్థానిక రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు దురాక్రమణలకు తహశీల్ధార్, ఆర్‌ఐ, వీఆర్‌వో కారణం అంటు దళితులు సోమవారం తహశీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఆగ్రహారంకు చెందిన సర్వేనెంబరు: 291/3 లో గల కోట్లాది రూపాయలు గల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పంటలు పండిస్తున్నారని, ఈ విషయమై గత నెలలో తహశీల్ధార్ రాము , ఆర్‌ఐ ఫణికుమార్ తోపాటు వీఆర్‌వోకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఈ ముగ్గరు లాలూచిపడటంతో కోట్లాది రూపాయలు ఆస్తులు అన్యాక్రాంతమౌతోందని నినాదాలు చేశారు. మాలమహానాడు కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ దళితులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేని అధికారులు కోట్లాది రూపాయలు ఆస్తులు కబ్జా చేస్తున్న ఎందుకు పట్టించుకోలేదని నిలధీశారు. అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మకై, ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెంచుపల్లి కృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అక్రమాలపై స్పందించని ఉన్నతాధికారులు….
స్థానిక రెవెన్యూ కార్యాలయం అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని , ప్రభుత్వ ఆస్తులు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్న పట్టించుకోలేదని , గత ఆరు నెలలుగా దళిత సంఘాలు 11 సార్లు ధర్నాలు, నిరసనలు చేశారు. కానీ దళితులు ప్రాణాలు పోయేలా ఆవేదన వ్యక్తం చేస్తున్న జిల్లా ఉన్నతాధికారులు స్థానిక తహశీల్ధార్, ఆర్‌ఐ, వీఆర్‌వోలపై చర్యలు తీసుకోకపోవడం సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది. మానటరింగ్ కమిటి సమావేశాలు సైతం సక్రమంగా నిర్వహించకపోవడంతో దళిత సభ్యుల ఆందోళనను పట్టించుకునే వారే కరువైయ్యారు. ఇకనైన ఉన్నతాధికారులు స్పందిస్తారా …?లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags: Dalit Organizations Protest Against Revenue Irregularities