May 31, 2026
Explore
మార్కెట్‌యార్డులో రైతులపై దాడి

మార్కెట్‌యార్డులో రైతులపై దాడి

May 31, 2026 | Andhra Pradesh

గేటుకు తాళాలు వేసి రైతులు నిరసన

పుంగనూరుముచ్చట్లు:

మార్కెట్‌యార్డులో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ , రైతులపై దాడులు చేస్తుండటంతో రైతులు శనివారం రాత్రి మార్కెట్‌ యార్డు గేటుకు తాళాలు వేసి , ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం మిట్టచింతవారిపల్లెకి చెందిన రైతు వెంకట్రమణ రాత్రి 10 గంటల సమయంలో టమోటాలు ట్రాక్టర్‌లో వేసుకుని మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న లారీ డ్రైవర్‌ ట్రాక్టర్‌కు అడ్డుపెట్టి దూషించడం జరిగింది. దీనిపై రైతు వెంకట్రమణ ప్రశ్నించే సమయంలో డ్రైవర్‌, అతని అనుచరులు కలసి వెంకట్రమణను క్రిందకు పడేసి కొట్టి గాయపరిచారు. దీనిపై రైతులు రాత్రి గేటుకు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. నినాదాలు చేశారు. కమీషన్ల పేరుతో దోపిడి చేస్తున్నారని, అడిగితే ప్రైవేటు వ్యక్తులచే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా,రమణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో సీఐ మాట్లాడారు. దాడి చేసిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని, ఇలా జరగకుండ చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

Tags: Attack on farmers at the market yard