May 31, 2026
Explore
మానవత సేవాసంస్థ నూతన కార్యవర్గం ఏర్పాటు

మానవత సేవాసంస్థ నూతన కార్యవర్గం ఏర్పాటు

May 31, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చుట్లు:

ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్న మానవత సేవాసంస్థకు ఆదివారం నూతన కార్యవర్గాన్ని చైర్మన్‌ నందీశ్వరయ్య ప్రకటించారు. నూతన అధ్యక్షుడుగా నరసింహారెడ్డి, కార్యదర్శిగా హరినాథరెడ్డి, ఉపకార్యదర్శిగా విశ్రాంత ఎంఈవో సరస్వతి, కోశాధికారిగా పూలత్యాగరాజు, ఉపాధ్యక్షుడుగా రెడ్డెప్పరెడ్డి లు ఈ మేరకు పదవి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన ప్రతినిధులు మాట్లాడుతూ ఎవరు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కష్టంలో అండగా ఉంటు, ఫ్రీజర్‌బాక్సులు, వైకుంఠరథము సకాలంలో ఉచితంగా అందించేలా ప్రణాళికలు చేసి సేవలు అందిస్తామన్నారు.

Tags: Manavata Service Organization Forms New Executive Committee