May 31, 2026
Explore
దొంగ అనుకుని చితకబాదిన గ్రామస్తులు

దొంగ అనుకుని చితకబాదిన గ్రామస్తులు

May 31, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

దొంగ అనుకుని ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాదిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఆదివారం మండలంలోని దిగువపల్లెలో బోరుబావుల వద్ద కేబుల్‌ వైర్లు దొంగతనం చేస్తున్నాడని రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లెకి చెందిన బాబాసాహెబ్‌ను గ్రామస్తులు వైర్లు, కర్రలతో తీవ్రంగా చితకబాదారు. ఈ దాడిలో బాబాసాహెబ్‌కు శరీరంపై తీవ్ర గాయాలైంది. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags;Villagers severely beat a man, mistaking him for a thief.