May 31, 2026
Explore
తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్-1861 సెక్షన్-30 అమలు.

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్-1861 సెక్షన్-30 అమలు.

May 31, 2026 | Andhra Pradesh

ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలకు ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి.

  • ప్రజా శాంతి భద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు.
  • నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు.
  • తిరుపతి ముచ్చట్లు:
  • ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ మరియు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా, తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్-1861లోని సెక్షన్-30 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సబ్-డివిజనల్ పోలీస్ అధికారులు తెలిపారు.
  • ముఖ్యంగా తిరుపతి, తిరుమల ప్రాంతాలకు దేశ విదేశాల నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివస్తున్న నేపథ్యంలో, ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
  • ఈ ఉత్తర్వులు 01-06-2026 నుండి 30-06-2026 వరకు అమల్లో ఉంటాయి. ఈ కాలంలో తిరుపతి జిల్లా పరిధిలో ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, సమావేశాలు లేదా ఇతర సామూహిక కార్యక్రమాలు నిర్వహించదలచిన వారు సంబంధిత పోలీస్ అధికారుల అనుమతితో పాటు సంబంధిత సబ్-డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీఓ) కార్యాలయం నుండి ముందస్తు లిఖితపూర్వక అనుమతి పొందడం తప్పనిసరి.
  • ప్రజా రహదారులు, కూడళ్లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఒకేసారి వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
  • అయితే వివాహాలు, అంత్యక్రియలు మరియు సంప్రదాయ కుటుంబ కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేశారు.
  • పోలీస్ యాక్ట్-1861 సెక్షన్-30 నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
  • ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి తిరుపతి జిల్లా శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా పోలీస్ అధికారులు కోరారు.

Tags:Section 30 of the Police Act, 1861, is in force across Tirupati District.