May 31, 2026
Explore
ప్రజలచే ప్రశంసలు పొందుతున్న సంస్థ మానవత సంస్థ

ప్రజలచే ప్రశంసలు పొందుతున్న సంస్థ మానవత సంస్థ

May 31, 2026 | Andhra Pradesh

విశ్రాంత ఉపాధ్యాయులు ఒంటేరు రెడ్డన్న,అంకం శంకర్ రెడ్డి

అల్పాహారం ఏర్పాటు చేసిన మానవత సభ్యులు నరసింహ రెడ్డి

రాయచోటి ముచ్చట్లు:

ప్రజలచే ప్రశంసలు పొందుతున్న సంస్థ మానవత సంస్థ అని కొనియాడారు విశ్రాంత ఉపాధ్యాయులు ఒంటేరు రెడ్డన్న,అంకం శంకర్ రెడ్డి.రాయచోటి పట్టణం ప్రతిభా జూనియర్ కళాశాల నందు అధ్యక్షులు అంకం జయచంద్ర రెడ్డి,చైర్మన్ అరమాటి గంగి రెడ్డి అద్వర్యంలో మానవత నెలవారీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి విశ్రాంత ఉపాధ్యాయులు ఒంటేరు రెడ్డన్న,అంకం శంకర్ రెడ్డి హాజరయ్యారు.మానవత సభ్యులు నరసింహ రెడ్డి అల్పాహారం ఏర్పాటు చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాయచోటిలో నిస్వార్ధమైన సేవలందిస్తూ మానవత సంస్థ ను ముందుకు తిసుకువేలుతున్న వ్యవస్థాపకులు యన్ రామచంద్ర రెడ్డి తో రాయచోటి మానవత కుటుంబ సభ్యులకు ప్రత్యెక అభినందనలు తెలిపారు.కేవలం సేవే కాకుండా మొక్కలను నాటి పర్యావరణాన్ని పెంపొందించడం,విద్యార్థులకు నైతిక విలువల పై అవగాహనా కల్పించడం లాంటి కార్యక్రమాలని చేస్తున్నటువంటి సేవా మూర్తులకు మరొక్క సరి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.మేము కుడా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి వారి ఉన్నత స్థాయికి తోడ్పాటు అందించామన్నారు.పదివి విరమణ పొందిన మేము మానవత సంస్థ ద్వారా ప్రజలకు సేవలందించే అవకాశాన్ని కల్పించి మానవత కుటుంబ సభ్యులకు ప్రత్యెక ధన్యవాదాలు తెలిపారు.మీ అందరి సహకారంతో సంస్థ ఎదుగుదలతో పాటు సేవా కార్యక్రమాలకు కావాల్సిన తోడ్పాటు అందజేస్తామని ఈ సందర్బంగా వారు పేర్కొన్నారు.అనంతరం మానవత సంస్థ సభ్యులు అతిదిలుతో పాటు అల్పాహారం ఏర్పాటు చేసిన వారిని శాలువాతో సత్కరించి మానవత జ్ఞాపికను అందజేసారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెంకట రమణ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి,ఆత్మీయ సహకార కమిటి చైర్మన్ వెంకట్రామి రెడ్డి,కో చైర్మన్ షకీల్,కార్యదర్శి నాగేశ్వర నాయక్,కోశాధికారి నాగార్జున,తదితర మానవత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

Tags: Manavatha is an organization receiving accolades from the public.