May 31, 2026
Explore
బయటపడిన 15వ శతాబ్దం నాటి శాసనాలు

బయటపడిన 15వ శతాబ్దం నాటి శాసనాలు

May 31, 2026 | Andhra Pradesh

-శ్రీరాముడు-సీతాదేవి అరణ్యవాసానికి సంబంధించిన ఆనవాళ్ళు

ప్రకాశంజిల్లా ముచ్చట్లు:

కొమరోలు మండలం హనుమంతరాయుని పల్లి గ్రామ సమీపంలోని ప్రాచీన దేవాలయంలో 15వ శతాబ్దం నాటి శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ శిలా శాసనాల ఆధారంగా శ్రీరాముడు, సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు కొద్దిగ రోజులపాటు ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఆలయ అర్చకులు వెల్లడించారు.

అంతేకాకుండా సీతమ్మవారు స్నానమాచరించినందుకు రాములవారు ఆలయ సమీపంలో ఒక బావిని తొవ్వించారని ఆ బావికి సీతమ్మ బావిగా నామకరణం చేశారని అర్చకులు తెలిపారు.

అలానే ఆలయ ప్రాంగణంలో సీతమ్మ వారి పాదాలు ముద్రలు కూడా ఉన్నాయని ఆలయంలో అమ్మవారు, వినాయకుడు, హనుమంతుడు, వీరభద్రుడు నాగేంద్రుడు ఇలా కొన్ని విగ్రహాలు 15వ శతాబ్దం నాటివని అర్చకులు తెలిపారు.

Tags; 15th-Century Inscriptions Unearthed