May 31, 2026
Explore
రోడ్డు దిగ్బంధనంతో మాలేపాడులో ఉద్రిక్తత

రోడ్డు దిగ్బంధనంతో మాలేపాడులో ఉద్రిక్తత

May 31, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలంలోని మాలేపాడులో టిడిపిలోనే రెండు గ్రూపులు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దారి, భూ వివాదాల కారణంగా టిడిపి లోని ఓ వర్గంకు చెందిన మధుకర్ రెడ్డి ని తన పొలాల్లో ఉండే కూరగాయలు, ఇతర పంటలు కోయ నీయకుండా మొదటగా అదే పార్టీకి చెందిన మరో వర్గంలోని జాఫర్ బాష నిలేశాడు. ఇప్పుడు రెండోసారి మధుకర్ రెడ్డి రహదారిని మూసి జాఫర్ బాషను పొలాల్లోకి రాకుండా రోడ్డు దిగ్బంధనం చేయడంతో జాఫర్ భాషా × మధుకర్ రెడ్డి ల మధ్య వివాదం తలెత్తి ఆదివారం ఉదయం రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో మాలేపాడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మాలేపాడుకు చేరుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది..

Tags; Tension in Malepadu Due to Road Blockade