భద్రాచలం ముచ్చట్లు:
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 27న శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు వార్షిక కల్యాణం చేస్తారు. ఈ క్రతువును వీక్షించేందుకు వీలుగా సెక్టార్ (విభాగం)లను ఏర్పాటు చేశారు. సెక్టార్‌లోకి ప్రవేశం కోసం రూ.7,500 (ఇది ఉభయ దాతల విభాగం. ఇందులో ఇద్దరికి ప్రవేశం ఉంటుంది), రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.100, 28న పట్టాభిషేకం కోసం రూ.1,500, రూ.500, రూ.100(ఒక్కరికి) విలువైన టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని రామాలయం వెబ్‌సైట్ https://bhadradritemple.telangana.gov.in ద్వారా శనివారం నుంచి భక్తులు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టినట్లు ఈఓ దామోదర్‌రావు శుక్రవారం ప్రకటించారు. కల్యాణానికి రాలేని భక్తులు.. ఇదే వెబ్‌సైట్ ద్వారా రూ.5 వేలు, రూ.1,116 టికెట్లను బుక్ చేసుకుని తమ గోత్ర నామాలతో కల్యాణం చేయించే సౌకర్యాన్ని కల్పించారు. కాగా, రామాలయం ప్రధాన కౌంటర్, తానీషా కల్యాణ మండపం (దేవస్థానం కార్యాలయం), బ్రిడ్జి వద్ద గల దేవస్థానం విచారణ విభాగం, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ ఉత్సవాల టికెట్లను ఈ నెల 15 నుంచి విక్రయించనున్నారు.
Tags: Sri Ramanavami sector tickets on sale online