మదనపల్లె ముచ్చట్లు:
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన రైతు ఆదివారం మృతి చెందాడు. మృతుని కుటుంబీకుల కథనం మేరకు.. మదనపల్లె మండలం, మాలెపాడు గ్రామం, ఆవుల పల్లెకు చెందిన యువ రైతు వెంకటేష్(38) తన వ్యవసాయ బోర్లలో నీళ్లు అడుగంటి పంటల సాగుకు నీటి కొరత ఏర్పడింది. బాగా రేట్లు ఉన్నప్పుడు పంటలు ఎండి పోతుండడంతో రూ.20 లక్షలకు పైగా ఉన్న అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచ కుండ పోయిందని శనివారం ఆ రైతు పొలంలోనే గడ్డి మందు తాగడం పాఠకులకు తెలిసిందే. కుటుంబీకులు బాదితున్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి స్థానికంగా ఉన్న మరో ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం వేకువ జామున రైతు వెంకటేష్ మృతి చెందాడని తెలిపారు.
Tags: Farmer who attempted suicide unable to bear the burden of debt passes away.