పుంగనూరుముచ్చట్లు:
పౌర్ణమి నాడు వందలాది గోమాతలకు పచ్చిగడ్డి ఆహారంగా అందిస్తూ , గోవుల సేవలో ఆనలుగురు మిత్రులు పట్టణంలో ఆదర్శంగా నిలిచారు. పట్టణంలోని తాటిమాకులపాళెంకు చెందిన కెఎస్.మణి, మదన్‌మోహన్‌సెట్, గణేష్‌రెడ్డి లు వ్యాపారం చేస్తుంటారు. విద్యాసాగర్ సాప్ట్వేర్ ఇంజనీర్. నలుగురు మిత్రులుగా ఉన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం వీరికి వచ్చిన ఆలోచన పలువురికి ఆదర్శమైయ్యారు. ప్రతి నెల నలుగురు చందాలు వేసుకుని రూ.10 వేలకు పైగా విలువ చేసే పచ్చిగడ్డి పున్నమి రోజు పశువులకు ఉదయం నుంచి సాయంత్రం దాక అందించడం చేపట్టారు. ఇలా ప్రతి నెల చేస్తుండటంతో లక్షలాది రూపాయలు పశువుల ఆహారం కోసం తమ ఆదాయాన్ని కేటాయిస్తున్నారు. పశువుల యజమానులు, వీధి పశువులు సైతం ఆహారం కోసం తాటిమాకులపాళెంలోని ఆర్టీసి డిపో వద్దకు చేరిపోతున్నాయి. యజమానులు తమకు కావాల్సిన గడ్డిని వాహనాలు, ఆటోలలో తీసుకెళ్తారు. ఇలా గోమాతల సేవలో తరిస్తున్న నలుగురి మిత్రులను పశు యజమానులు అభినందిస్తున్నారు.


Tags: Those four friends are role models in the service of cows.