పుంగనూరుముచ్చట్లు:
తెలుగుదేశం ప్రభుత్వం మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను దగా చేయడంపై వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లె కలెక్టరేట్ వద్ద చేస్తున్న నిరసనకు నిరుద్యోగులు తరలిరావాలని నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి సూచనల మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆందోళనలో యువతి, యువకులు , నిరుద్యోగులు , పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags; Come to the protest against the ‘Deceptive DSC’ on the 1st.