చౌడేపల్లెముచ్చట్లు:
రాష్ట్రంలోని నిరుద్యోగులను డీఎస్సీ పేరుతో దగా చేసి అవినీతి అక్రమాలకు పాల్పడిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మరియు తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్ వద్ద చేసే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిషోర్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 9:30 గంటలకు మదనపల్లిలోని కలెక్టరేట్ వద్ద నిరసన చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ మోసం చేస్తున్న తీరుపై ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, అవినీతి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ యువజన విభాగం అధర్వంలో చేపట్టే ఈ కార్యక్రమానికి జిల్లాలోని యువజన విభాగం నాయకులు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
Tags:Make ‘Chalo Collectorate’ a Success: Middinti Kishore