ఒకరి పరిస్థితి విషమం
- మరొకరికి స్వల్ప గాయాలు
పుంగనూరుముచ్చట్లు:
అతివేగంగా వస్తున్న బస్సు ద్విచక్రవాహనదారుడిని అతివేగంగా ఢీకొనడంతో ఇద్దరు గాయపడగా , వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బోడినాయునిపల్లెకి చెందిన భానుప్రసాద్ (25), గుట్టపల్లెకి చెందిన రేవంత్(23) ఇద్దరు ద్విచక్రవాహనంలో తమ సొంత పనులు ముగించుకుని ఇంటికి వెళ్తూ మార్గ మధ్యంలో గల పట్టణంలోని కొత్తయిండ్లు సమీపంలో ఎదురుగా మదనపల్లె నుంచి వస్తున్న ప్రైవేటు టైలరింగ్‌యూనిట్ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భానుప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. రేవంత్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వెంటనే స్థానికులు భానుప్రసాద్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో భానుప్రసాద్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Bus Hits Two-Wheeler