పుంగనూరుముచ్చట్లు:
రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి పేరుతో మిధున్‌దళం క్రికెట్ టోర్నమెంట్‌లో జువ్వలదిన్నెతాండాకు చెందిన బంజారటీమ్ శనివారం ప్రథమ స్థానంలో నిలిచింది. మిధున్‌దళం క్రికెట్ పోటీలను వైఎస్సార్‌సిపి జిల్లాయూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా శుక్రవారం మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. హ్గరాహ్గరీగా సాగిన క్రికెట్ టోర్నమెంట్‌లో జువ్వలదిన్నెతాండా యూత్ వెహోదటి బహుమతి రూ.27,116 నగదు, కప్‌ను కైవసం చేసుకున్నారు. అలాగే రెండవ బహుమతి నారామాకులపల్లెకి చెందిన యూత్ కైవసం చేసుకున్నారు. రెండవ బహుమతి క్రింద రూ.15,116 నగదు, కప్ ను గెలుచుకున్నారు. విజేతలను చెంగారెడ్డితో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాబునాయక్ మునీంద్రనాయక్, శ్రీనివాసులునాయక్, ఆంజినాయక్, రాజునాయక్, వేణునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Juvvaladinne Thanda Wins First Prize in the Mithun Dal Cricket Tournament.