పారిశుద్ధ్యంలో కార్మికులు, అధికారులు బిజిబిజి
పుంగనూరుముచ్చట్లు:
పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించేలా క్లీన్‌స్వీప్ కార్యక్రమాన్ని గత వారం మదనపల్లె సబ్‌కలెక్టర్, మున్సిపాలిటి స్పెషలాఫీసర్ కళ్యాణి ఆధ్వర్యంలో కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ప్రారంభించారు. ఈనెల 25 న మున్సిపాలిటిలో ప్రారంభించిన క్లీబ్‌స్వీప్ కార్యక్రమంలో అధికారులు, కార్మికులు పూర్తిస్థాయిలో నిమగ్నమై పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కౌండిన్యనది కాలువలో పూడుకుపోయిన మురుగునీటి నిల్వలను జెసిబిలతో తొలగించారు. దోబిఘాట్ నుంచి ఎంపీడీవో ఆఫీసు, చౌడేపల్లె రోడ్డు, తాటిమాకులపాళెం, సంతగేటు ప్రాంతాలలోని కౌండిన్యనది కాలువలో పూర్తిగా మురుగునీటి నిల్వలను తొలగించారు. అలాగే పట్టణంలో ప్రధాన కాలువలు, చిన్నచిన్న కాలువల్లో సైతం పూడికమట్టిని తొలగించి, ఎప్పటికప్పుడు ఆ మట్టిదిబ్బలను, చెత్తను కంపోస్ట్ యార్డుకు తరలించారు. గత ఆరునెలలుగా ఎన్నడు లేనివిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను వేకువజాము నుంచి రాత్రి దాక కమిషనర్ పర్యవేక్షణలో కార్మికులు పని చేయడంతో పట్టణంలో చెత్తాచెదారం క్లీన్‌స్వీప్ అయింది. వేసవికాలంలో అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టడంతో ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags; Complete Cleanup of Garbage and Debris in the Municipality