పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం గరుడసేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ యశ్వంత్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడవాహనంపై ప్రత్యేకంగా అలంకరించి పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకుపాత్రులు కావలెనని ఆయన కోరారు.
Tags: Garuda Seva for Sri Kalyana Venkanna on the 31st.