అమరావతిముచ్చట్లు:
జీవితంలో కష్టం, సవాళ్ల ప్రాముఖ్యంపై నటుడు సత్యదేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘దేవుడు నిన్ను రాజుని చేయాలనుకుంటే నేరుగా కిరీటం ఇవ్వడు. ముందు యుద్ధాన్ని ఇస్తాడు. ఆ యుద్ధంలో గెలిచినప్పుడే నీకు కిరీటం దక్కుతుంది. జీవితంలో కష్టపడకుండా ఏదీ సాధించలేం. సవాళ్లను స్వీకరించి మనల్ని మనం నిరూపించుకున్నప్పుడే ఉన్నత స్థానానికి చేరుకోగలం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు యువతలో స్ఫూర్తిని నింపుతున్నాయి.
Tags: Success Comes Only by Overcoming Challenges: Satyadev