May 30, 2026
Explore
బైక్ కొనివ్వడం లేదని.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

బైక్ కొనివ్వడం లేదని.. భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

May 30, 2026 | Andhra Pradesh

సంగారెడ్డి ముచ్చట్లు:

సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం మారేపల్లికి చెందిన దాసరి అంజయ్య (25)కి 11 నెలల కిందట నారాయణఖేడ్ మండలం సంజీవ్‌రావుపేటకు చెందిన యాదమ్మ(20)తో వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత మారేపల్లి శివారులో ఓ మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. మద్యానికి బానిసైన అంజయ్య.. అత్తింటి వారు బైక్ కొనివ్వాలని తరచూ భార్యతో గొడవపడేవాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అంజయ్య.. ఆవేశంలో యాదమ్మను గదిలో చున్నీతో ఉరివేసి హత్య చేశాడు.

ఆ తర్వాత పోలీసులు పట్టుకుని, జైల్లో వేస్తారని భయాందోళన చెంది.. ఘటనాస్థలికి కొద్దిదూరంలో మామిడిచెట్టుకు ఉరివేసుకున్నాడు.

Tags: Husband Kills Wife and Commits Suicide Because She Refused to Buy Him a Bike