అమరావతిముచ్చట్లు:
జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. దీన్ని ఆరో తేదీకి మార్పు చేశారు.
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ ఐదో తేదీ వరకు ఉన్నందున ఈ మార్పు చేశారు. ఆరో తేదీన పునః ప్రారంభించాలని సూచించారు.
అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పూ లేదని పేర్కొన్నారు.
Tags: Orders issued extending summer holidays for Junior Colleges.