అమరావతిముచ్చట్లు:
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్, బీపీటీ, వైద్య పీజీ, ఆయుష్ కోర్సుల వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 21 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది.
పరీక్షలు పూర్తయిన 15 మందిని ఏడాది పాటు డిబార్ చేసినట్లు వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు.
వీరిలో 6 మంది ఎంబీబీఎస్, 8 మంది బీడీఎస్, ఒకరు బీపీటీ విద్యార్థులు ఉన్నారు.
మిగిలిన ఆరుగురిపై పరీక్షలు ముగిసిన తర్వాత చర్యలు తీసుకోనున్నారు.
మాస్ కాపీయింగ్ జరిగిన పరీక్ష కేంద్రాల కళాశాలలకు రూ. 50 వేల జరిమానా విధించారు
Tags: 15 medical students debarred for cheating in exams