May 30, 2026
Explore
రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పార్సల్ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు.

రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పార్సల్ కార్యాలయాల్లో విస్తృత తనిఖీలు.

May 30, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై “జీరో టాలరెన్స్” విధానం అమలు
  • నార్కోటిక్ డాగ్స్ సహాయంతో మాదక ద్రవ్యాల గుర్తింపు చర్యలు, ప్రత్యేక తనిఖీలు
  • గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా ఈగల్ టీమ్ ఇన్‌స్పెక్టర్ డి. నాగార్జున రెడ్డి మరియు సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మరియు పార్సల్ కార్యాలయాల్లో నార్కోటిక్ డాగ్స్ సహాయంతో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు, పార్సిళ్లు, సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు లేదా సరఫరా కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ “జీరో టాలరెన్స్” విధానాన్ని అమలు చేస్తోందని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతగా భావిస్తోందని అధికారులు పేర్కొన్నారు.చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల సహకారంతో మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.ప్రజల భద్రత, యువత భవిష్యత్తు పరిరక్షణ దృష్ట్యా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Tags: Extensive inspections at railway stations, bus stands, and parcel offices.