May 28, 2026
Explore
ఆ రోజుల్లో ఎన్టీఆర్ దినచర్య ఇలా ఉండేది..

ఆ రోజుల్లో ఎన్టీఆర్ దినచర్య ఇలా ఉండేది..

May 28, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నేడు దివంగత లెజెండ్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి. ఈ సందర్భంగా అప్పట్లో ఆయన దినచర్య ఎలా ఉండేదో తెలుసుకుందాం. మద్రాసు మహానగరం, త్యాగరాయనగర్‌లోని బజుల్ల రోడ్డులో ఉన్న ఆయన నివాసం లక్ష్మీ నిలయం, ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలోనే సందడిగా మారేది.ఎన్టీఆర్ తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి, ఆరుబయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చేవారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కొంతసేపు వ్యాయామం చేయడం ఆయన దినచర్యలో భాగం. సరిగ్గా మూడున్నరకు వాహిని స్టూడియో నుంచి మసాజ్ చేసే వ్యక్తి వచ్చేవారు. విజయ అధినేత నాగిరెడ్డికి అత్యంత ఆంతరంగికుడైన ఆ వ్యక్తి, ఎన్టీఆర్ కోరిక మేరకు ఆయనకు, ఆయన సోదరుడు త్రివిక్రమరావుకు మసాజ్ చేసేవారు. మసాజ్ సమయంలో ఎన్టీఆర్ గోచి కట్టుకొని సిద్ధంగా ఉండేవారు. అరగంట పాటు శరీరానికి ఆయిల్ పట్టించి మసాజ్ జరిగేది. అనంతరం ఎన్టీఆర్ స్నానం చేసి, పూజ ముగించుకుని, తెల్లని పంచె, లాల్చీ ధరించి తన ఆఫీస్ రూమ్‌లో కూర్చునేవారు. అక్కడ తన బ్యానర్‌పై తీయబోయే చిత్రాల స్క్రిప్ట్‌లు చూడటం, రచయితలకు మార్పులు సూచించడం, కథా చర్చలు జరిపేవారు. సరిగ్గా 5 గంటలకు ఐదు నిమిషాల్లో భోజనం పూర్తి చేసుకు.

Tags:In those days, NTR’s daily routine was like this.